పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. రొంపిచర్ల మండల పరిధిలోని అన్నవరప్పాడు హైవే బ్రిడ్జిపై లారీ, బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వినుకొండ నియోజకవర్గ పరిధిలోని ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన మొండితోక బాలశౌరి, రావెల వెంకటేశ్వర్లు మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.