ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. జగన్ సర్కారు గత ఐదేళ్లలో చేసిన సంక్షేమాన్నే నమ్ముకుంది. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ తమ పార్టీనే గెలిపించాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. తాము సింగిల్‌గా బరిలోకి దిగుతుంటే.. బలం లేకపోవడంతోనే టీడీపీ కూటమి ఏర్పాటు చేసుకుందని.. జనసేన, బీజేపీతో కలిసి ఆ పార్టీ పోటీ చేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు టీడీపీ కూటమి సైతం వైఎస్సార్సీపీకి ధీటుగా బదులిస్తోంది. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని.. అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా తాము జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.
ఓవైపు వైఎస్సార్సీపీ, మరోవైపు టీడీపీ కూటమి.. ఎన్నికల్లో తామే గెలుస్తామని, అధికారంలోకి రావడం ఖాయమని ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడం కోసం సమయం తెలుగు ఒపీనియన్ పోల్ నిర్వహిస్తోంది. మేం అడిగే ప్రశ్నలకు బదులివ్వడం ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. పోల్ ఫలితాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మేం వెల్లడిస్తాం. గతంలో మేం చేపట్టిన పోల్స్‌లో కచ్చితమైన ఫలితాలు వచ్చాయి. కాబట్టి గతంలో మాదిరిగానే.. ఈసారి కూడా సమయం పోల్‌లో మీ అభిప్రాయాన్ని వెల్లడించండి. ఈ పోల్‌ను ఏపీలోని మీ బంధు, మిత్రులకు షేర్ చేయండి.