బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో మంగళవారం వారి గుడిసెలో మంటలు చెలరేగడంతో ఐదుగురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రమైన ససారంలోని నస్రీగంజ్ సబ్ డివిజన్‌లోని ఇబ్రహీంపూర్ గ్రామంలో మంగళవారం ఈ సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు.మృతులను పుష్పాదేవి (30), ఆమె ఇద్దరు కుమార్తెలు కాజల్ కుమారి (4), గుడియా (2), ఆమె కుమారుడు బజరంగీ కుమార్ (6)గా పోలీసులు గుర్తించారు. మృతులు కాంతి కుమారి (6), శివాని (3), మాయాదేవి (25) పుష్ప బంధువులని అధికారి తెలిపారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.