కర్ణాటక బోయపలికి చెందిన చంద్రప్ప ద్విచక్ర వాహనంపై 1, 152కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా మంగళవారం అమడుగురు వద్ద ఆంధ్ర - కర్ణాటక సరిహద్దుల్లోని గొల్లపల్లి వద్ద పట్టుకున్నట్లు ఎస్ఐ మస్బుల్ భాష తెలిపారు. మద్యం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం కదిరి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.