ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 10:03 PM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. 1:100 నిష్పత్తిలో రిజల్ట్స్ రిలీజ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన ఏడు వారాల్లోనే గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో 899 ఉద్యోగాల భర్తీకి గ్రూప్-2 పరీక్ష నిర్వహించగా.. మొత్తం 4లక్షల 4వేల 37 మంది ఈ పరీక్షలు రాశారు. వీరిలో 92 వేల మంది అర్హత సాధించారు. త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa