రోడ్డు ప్రమాదంలో ఇరువురు గాయపడిన సంఘటన కలకడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిలోని బాలయ్యగారిపల్లి వద్ద ఆటో, టాటా ఏసీ ఢీకొన్న ప్రమాదంలో స్థానిక రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సాదిక్ అలీ, అన్వర్ భాష ఆటోలో వస్తుండగా ఎదురుగా టాటా ఏసీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సాధిక్ అలీ, అన్వర్ బాష గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa