అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిత్యా అన్నదానం ట్రస్ట్ కి శనివారము శ్రీకాకుళం వాస్తవ్యులు గుంటూరి సీతా రామారావు, ఉషాదేవి దంపతులు వారి తల్లిదండ్రులుల జ్ఞాపకార్థం లక్ష రూపాయలు ఆలయ ఈవో కి చెక్కు రూపంలో అందజేశారు. ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ చెక్కును వారి గృహానికి వెళ్లి అందుకున్నారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను మరియు ప్రసాదాలను ఆలయ ఈవో అందజేశారు.