పాతపట్నం మండలం పెద్దసీదిగ్రామంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి శనివారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి సీఏం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు గురించి వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.