‘నారా డిజాస్టర్ అలయెన్స్’గా ఏపీ ఎన్డీఏ మానిందపి వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అభివర్ణించారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరిల కాలకూట విష కూటమి అది అని చెబుతున్నారని తెలిపారు. విశాఖపట్టణంలోని తన కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ..... ఎన్నికలు జరుగుతున్న తరుణమిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా జగనన్నకు మళ్లీ ఓట్లేసి.. ఆయన్నే మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. ఎవరెన్ని కూటములు కట్టినా ప్రజలు మాత్రం 2024 వన్స్‌మోర్ అంటూ.. జగనన్న వైపే ఉన్నారు. దానికి నిదర్శనంగా మనం జగనన్న బస్సుయాత్రకు వస్తోన్న స్పందనను చూస్తున్నాం. మండుటెండ లను సైతం లెక్కచేయకుండా కాళ్లు కాలుతున్నప్పటికీ ప్రజలు తండోప తండాలుగా జగనన్నకు ఎదురొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న గుంటూరులో వర్షంలో తడుస్తూ కూడా జనం బారులు తీరి మరీ.. జగనన్న బస్సు యాత్రకు మద్ధతుపలికారు. ఐదేళ్ల పరిపాలనలో జనం మేలు కోరిన జగనన్నను చూడాలని.. ఆయనకు తమ మద్ధతు ప్రకటించాలని మహిళలు, వృద్ధులు, చిన్నారులతో సహా అందరూ ఊరూరా తరలిరావడం చూస్తున్నాం అని అన్నారు.