కూడేరు మండలంలోని కలగళ్ల గ్రామానికి చెందిన భారతి అనే గ్రామ వాలంటీరు రెండు రోజులుగా కనిపించడం లేదని కుటుంబసభ్యులు శనివారం కూడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఈనెల 12న వాలంటీరు ఉద్యోగానికి రాజీనామా చేయడానికి కూడేరుకు వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరాముడు తెలిపారు.