నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా ఓట్ల నమోదుకు తెరలేపిన రాప్తాడు నియోజకవర్గం ఈఆర్వో/ఆర్వో వసంత బాబుపై విచారణకు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఆదేశించారు. విచారణ అధికారిగా డీఆర్డి రామకృష్ణారెడ్డిని నియమించారు. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి కొత్త ఓట్ల నమోదు, ఏఈఆర్టీ, బీఎల్డీల ఆమోదం, క్షేత్ర పరిశీలన లేకుండా నేరుగా ఫామ్-6 దరఖాస్తులను ఆమోదించడంపై విచారణకు ఆదేశించారు.