ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.