విజయవాడ నడిపోడ్డులో 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పిన రోజు నుంచి ఒక వర్గానికి చెందిన కొందరు సీఎం జగన్‌పై కక్షగట్టారు. గతంలో టీడీపీ కూడా సీఎం జగన్‌పై అక్రమ కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టించింది. కోడి కత్తి దాడిలో కూడా టీడీపీ నేతల ప్రమేయం ఉంది. చంద్రబాబు తన ప్రసంగాల్లో రాళ్ల దాడులకు టీడీపీ శ్రేణులను ఉసిగొల్పుతున్నారు. ఇది దురదృష్టకరమైన విషయం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా బస్సు యాత్రను జగన్ కొనసాగిస్తారు అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కె.రాజశేఖర్ అన్నారు.