తుళ్లూరులో చంద్రబాబు.. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టాలని చెప్పారు. చంద్రబాబు మాటలు విని కులోన్మాదంతో విజయవాడలో హత్యాయత్నం చేశారు. దీన్ని ఖండించాల్సిన కొందరు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు అని శాసనమండలిలో ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... అలిపిరి ఘటనను నటన అని ఎవరైనా అన్నారా? ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్సార్ చంద్రబాబుకు సంఘీభావంగా తిరుపతిలో మౌనదీక్ష చేశారు. చంద్రబాబు భుజాలు తడుముకోవడం చూస్తే వీళ్లే దాడి చేయించి ఉంటారని కచ్చితంగా భావించాల్సి వస్తోంది. ఇలాంటి దాడులకు బెదిరే వ్యక్తి కాదు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో సీఎం రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు అని ధీమా వ్యక్తపరిచారు.