సీఎం వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రపూరితం. చంద్రబాబే దీనికి కారకుడు. విజయవాడ నడిపోడ్డున బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు హారతులు పడుతుంటే తట్టుకోలేకే చంద్రబాబు ఇలా చేయించారు అని వైయస్ఆర్‌సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... యాత్రకు వచ్చిన జనాన్ని టీవీల్లో ప్రజలు చూస్తే టీడీపీకి పుట్టగతులుండవని భయపడే చంద్రబాబు ఈ దురాగతానికి పాల్పడ్డారు. సీఎం వైయస్ జగన్‌నుద్దేశించి చంద్రబాబు చాలాసార్లు మసి చేస్తాం.. అన్నారు.. వైయస్ జగన్‌ను మసి చేయాలనే ప్రయత్నంలో భాగమేనా ఈ హత్యాయత్నం? వైయస్ జగన్‌ను ఎదుర్కోలేకే చంద్రబాబు కూటమి కట్టారు. సీఎం వైయస్ జగన్ ఉంటే రాజకీయం చేయలేమన్న నిర్ణయానికి వచ్చాకే చంద్రబాబు ఇలా చేశారు. అందుకే విజయవాడను సరైన ప్రదేశంగా బాబు ఎంచుకున్నారు. రాయి తగిలినట్టుండాలి.. ప్రాణం పోవాలి.. అనే రీతిలో ఇదంతా పక్కాగా ప్లాన్ చేశారన్న విషయం అర్థమవుతోంది అని అన్నారు.