ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైయస్ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈఓతో వైయస్ఆర్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైయస్ఆర్‌సీపీ నేతలు భేటీ అయ్యారు. సీఎం వైయస్ జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఈసీకీ వైయస్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై నిన్న బస్సుయాత్ర సందర్భంగా విజయవాడలో జరిగిన దాడి వెనక కుట్ర కోణం ఉందని పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై దాడి ఘటనపై సచివాలయంలోని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు అందించారు. శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎంపీ లు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, నందిగామ సురేష్,mlc లేళ్ళ అప్పిరెడ్డి, ఎంఎల్ఏ మల్లాది విష్ణు,మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు,పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ మనోహర్ రెడ్డి లు ఫిర్యాదు చేశారు.