విపక్ష నేత చంద్రబాబు చెప్పే బూటకపు హామీలను నమ్మవద్దని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు పిలుపునిచ్చారు. పరదేశీపాలెం జంక్షన్ నుంచి కళ్లేపల్లి మంత్రి ధర్మాన ప్రచార యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో అనేక ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మీ గ్రామానికి వచ్చాం.. ఇపుడు రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ తరఫున శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా పేరాడ తిలక్ పోటీ చేస్తున్నాం. మా ఇరువురినీ గెలిపించమని అభ్యర్థించేందుకు ఇవాళ మీ గ్రామానికి వచ్చాం. తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్య నాయకులు చేరడం శుభ పరిణామం. వారు చేరడంతో కళ్లేపల్లి గ్రామ పరిధిలో పార్టీ బలపడింది. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వాన సాగిన పాలన చూడండి. ఐదేళ్ల ముందు మీ కుటుంబాలు ఎలా ఉండేవి ? ఇప్పుడు ఎలా ఉన్నాయి ? ఏ విధంగా మార్పు చెందాయి ? అన్నవి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరో చెప్పడం ఎందుకు మీకు మీరే ఆలోచించండి. ఏ ప్రభుత్వం వల్లన ఈ రోజు సంతోషంగా ఉన్నామో అన్నది మీరే చెప్పండి. ఎన్నికల వేళ నాయకులందరూ చెబుతారు కానీ ఎన్నికలు అయ్యాక ఆ మాట మీద ఎవరు ఉన్నారో ఆలోచించండి. ఇచ్చిన హామీల అమలుకు ఎవరు కృషి చేశారో ఆలోచించండి అని అన్నారు.
![]() |
![]() |