ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. సీఎం వైయస్ జగన్‌పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే వైయస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు. సీఎం వైయస్ జగన్‌పై దాడిని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే సీఎం వైయస్ జగన్‌పై దాడి జరిగింది. దాడి చేసిన వెంటనే బాబు మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. సీఎం జగన్‌పై దాడిని కూడా డ్రామా అనడం చంద్రబాబు నైజం. విచారణ వేగంగా జరుగుతుంది.. వాస్తవాలు బయటకి వస్తాయి. ఈ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్ వెంటనే దర్యాప్తు చేయాలన్నారు.