సీఎంపై దాడి అంటే ఆషామాషీ విషయం కాదు దాన్ని మేము ఖండిస్తున్నామని అయితే తెదేపా వారే దాడి చేయించారనడం వైకాపా సిగ్గు మాలిన చర్యలకు ప్రతీక అని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆదివారం ఉరవకొండ లో పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన ఘటన జరుగుతుందని అది ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా మారుతుందని వైకాపా సోషల్ మీడియా ప్రతినిధి అవుతు శ్రీధర్ రెడ్డి నాలుగు రోజుల క్రితమే సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారన్నారు.
![]() |
![]() |