రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చిన మరోసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయమని రాజాం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ రాజేష్ అన్నారు. సోమవారం వంగర మండలం, కోండచాకరాపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలను మోసం చెయ్యడానికే చంద్రబాబు కూటములు కట్టారన్నారు. వైయస్ఆర్‌సీపీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని, నవరత్నాల పథకాల వల్ల పేదల జీవితాలు బాగుపడ్డాయని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి ఈ ఐదేళ్లలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారిని గెలిపించాలని కోరారు.
![]() |
![]() |