ముదిగుబ్బ పట్టణం కొట్టాల దగ్గర సోమవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని హసీనాయక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని నివాళులు అర్పించారు. వారి కుటంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.