కారుతో ఢీకొట్టిన డ్రైవర్ వాహనం పై పడిన మృతదేహంతో 18 కి. మీ దూరం ప్రయాణించిన దారుణం ఆత్మకూరు మండలం వై. కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రిస్వామి(35) వ్యక్తిగత పనులపై పి. సిద్దరాంపురం వెళ్లి ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.
వై. కొత్తపల్లి సమీపంలోకి రాగానే కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వెళ్లి ఢీ కొట్టింది. దీంతో ఎర్రిస్వామి ఎగిరి కారుపైన పడిపోయారు. గమనించని డ్రైవర్ వేగంగా కళ్యాణదుర్గం వైపు వెళ్లాడు. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై వ్యక్తి పడి ఉండటాన్ని వాహనదారులు గమనించి, అడ్డంగా వెళ్లి కారు ఆపగా డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. కారు బెంగళూరుకు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
![]() |
![]() |