వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? వారిని కాపాడుతోంది ఎవరు? సీఎం జగన్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేకా కుమార్తె సునీత సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి పట్టుపడుతున్నారని, దీంతో ఆయన అడ్డు తొలగిస్తే.. షర్మిలకు సపోర్టు ఉండదని, ఇక తమకు ఎదురు ఉండదని భావించి.. వివేకను హత్య చేశారని.. ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి తనకు లభించిన ఆధారాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియ చేస్తున్నారని సునీత పేర్కొన్నారు.