టీడీపీ అధికారంలోకి రాగానే మొట్టమొదట కాలనీలో మురుగు కాలువలు, రోడ్లు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత అన్నారు. తమ్మరాజుపల్లె, పిన్నాపురం, గోరుకల్లు, కొండజూటూరు గ్రామాలలో ఆదివారం శంఖారావంలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఆమె మాట్లాడుతూ తమ్మరాజుపల్లెకు గుండెకాయవంటి ఏటిపాయ పర్కులేషన్ డ్యాం నిర్మా ణాన్ని నలభై ఏళ్లయినా పూర్తి చేయలేకపోయారని ఎమ్మెల్యే కాటసానిపై మండిపడ్డారు. సహజసిద్దమైన కొండలను కొల్లగొట్టి మట్టి, కంకరను అక్రమంగా దోచే సుకున్నారని ఆరోపించారు. బ్లాస్టింగ్‌లతో ఇల్లు కూలి పోతున్నా పట్టించుకోకుండా తమ ఆదాయం పెంచుకుంటున్నారన్నారు. గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ నారాయణమ్మ, మాజీ ఎంపీటీసీ వెంకటరమణ, రామ్మోహన్‌నాయుడు, దుబాయ్ శీను, చల్లా సురేష్, రాజేంద్ర, మధు, ఈడిగ శేఖర్, రవి, సురేష్, నారాయణ పాల్గొన్నారు. కొండజూటూరు గ్రామంలో ఆదివారం పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత ఆద్వర్యంలో పది వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో శాంతప్ప, మాజీ సర్పంచ్ గంగనారాయణ, రాచమల్ల నాగిరెడ్డి, కేశన్న, పంచాయతీ వార్డు సభ్యులు ఎల్లాసుబ్బయ్య, మల్లయ్య, భోగేశ్వరుడు, మల్లికార్జున గౌడ్, శరువప్ప, పుల్లయ్య, రామయ్య, కోటయ్య, సంజన్న పాల్గొన్నారు.