బీజేపీ ఎంపీ హేమా మాలినీపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉప్రమించింది. సూర్జేవాలా 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీఐ నిషేధం విధించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 తరపున అనుమతించే అన్ని ఇతర అధికారాల ప్రకారం సుర్జేవాలా బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, మీడియాలో బహిరంగ ప్రసంగాలు మొదలైనవి నిర్వహించకుండా నిషేధించింది.