హనుమంతునిపాడులో మంగళవారం ఎస్సై శివ నాగరాజు ప్రజలకు రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి అవగాహన కల్పించారు. ప్రజలందరూ శాంతియుత ఎన్నికలు నిర్వహించేలా సహకరించాలని అన్నారు. అలానే మండలంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, అలానే నేరచరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఆయన హెచ్చరించారు.