కనిగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సృజన మంగళవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె చెప్పారు. రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు మంచినీళ్లతో పాటు మజ్జిగ కొబ్బరి బోండా నీళ్లు తీసుకోవాలి డాక్టర్ సుజన తెలియజేశారు.