పామూరు మండలంలోని వర్గం పల్లి వద్ద మంగళవారం ఎస్సై సైదులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వాహనలు క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. రూ. 50వేల నగదు మించి ఉంటే వాటికి ఆధారాలు చూపించాలని, ఆనగదుకు ఆధారాలు చూపించకపోతే నగదును సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.