ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బికినీ వేసుకుని బస్సెక్కిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే

national |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 09:55 PM

భారత దేశ సంస్కృతి అంటే విదేశాల్లో ఎంతో గౌరవం ఉంది. విదేశాల్లో ఉండేవారు కూడా భారత సంప్రదాయ వస్త్రాలను ధరించేందుకు ఆసక్తి చూపుతారు. కానీ మన దేశంలో కొందరు మాత్రం.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాదని విదేశీ సంప్రదాయాల బాట పడుతున్నారు. ఇక బట్టల విషయంలో ఇది మరింత దారుణంగా ఉంటోంది. చీర, చుడిదార్ వంటివి ఒకప్పుడు భారతీయ స్త్రీలు కట్టుకునేవారు. రాను రాను.. ఆ సంస్కృతి తగ్గిపోతోంది. ఏ పండగకో, స్పెషల్ కార్యక్రమానికో తప్పితే అలాంటి దుస్తులు వేసుకునేవారే కరవయ్యారు. జీన్స్, టీ షర్ట్స్.. ఇంకొందరైతే బికినీలు వేసుకుంటున్నారు. ఇలా బికినీ వేసుకున్న ఓ మహిళ.. రోడ్డుపైకి రావడమే కాకుండా ఏకంగా.. రద్దీగా ఉండే బస్ ఎక్కింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.


ఢిల్లీలో పగటి పూట రద్దీగా ఉన్న బస్సులోకి ఓ మహిళ ఎక్కింది. అయితే ఆ మహిళ.. జుట్టు విరబోసుకుని.. బికినీ ధరించి ఉండటంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఆమెను చూసి షాక్ అయ్యారు. ఇక మరికొందరు అయితే తాము కూర్చున్న సీటులో నుంచి లేచి బస్సు దిగిపోయారు. ఇక ఆ మహిళ బికినీ ధరించి బస్సు ఎక్కడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్‌ అవుతోంది. 12 సెకన్లు ఉన్న ఆ వీడియోలో ఓ మహిళ బికినీ వేసుకుని బస్సు ఎక్కడం కనిపిస్తోంది. ఇక ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు.. ఆ మహిళ పట్ల కోపంగా, ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.


ఇక ఆ బస్సు కండక్టర్ పరిస్థితి మరో రకం. ఆమెను బస్సు దించేయలేక.. కూర్చోమనలేక ఇబ్బంది పడ్డాడు. సదరు మహిళ బికినీ ధరించి రావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి బట్టలు వేసుకుని ఎవరైనా జనాలు తిరిగే రద్దీ ప్రాంతాలకు వస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇక ఇలాంటి వారిని ముందు బస్సు నుంచి బయటికి తోసేయాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఆ మహిళకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెట్టడం గమనార్హం. ఆమె శరీరం, ఆమె బట్టలు, ఆమె ఇష్టం.. ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని చెప్పడానికి మీరు ఎవరు అంటూ ప్రశ్నింఛారు. ఇక ఇలాంటి షాకింగ్ ఘటనలు ఢిల్లీ మెట్రో రైళ్లలో సర్వసాధారణం అయిపోయాయి. అసభ్యకరంగా బట్టలు వేసుకోవడం, మెట్రో రైలులోనే అశ్లీల కార్యకలాపాలు సాగించడం వంటి సంఘటనలు తరచూ జరగడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com