ఇటీవల ఇజ్రాయెల్‌పై దాడి చేసిన ఇరాన్‌పై అమెరికా, బ్రిటన్ కొత్త ఆంక్షలు విధించాయి. ఈ దాడిలో ఇరాన్ వినియోగించిన డ్రోన్ల ఇంజిన్లను ఉత్పత్తి చేసే 16 మంది వ్యక్తులపై, రెండు సంస్థలపై అలాగే ఇరాన్ సైన్యానికి మద్దతు ఇచ్చిన ఐదు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. అటు బ్రిటన్.. డ్రోన్, బాలిస్టిక్ క్షిపణి తయారిలో సహకరించిన పలు సైనిక సంస్థలపై ఆంక్షలు విధించింది.