కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 250 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీ గూటికి చేరాయి. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కర్నూల్ పట్టణంలోని 38వ వార్డు, 39వ వార్డ్, 40వ వార్డ్, బి.తాండ్రపాడు గ్రామపంచాయతీ పరిధిలోని టీవీ9 కాలనీకి సంబంధించిన టిడిపి నాయకులు కోట్ల హర్ష యూత్, కళ్యాణ్ రామ్ రెడ్డి, ఎండి అస్లాం, సయ్యద్ ముజామిల్ ఆధ్వర్యంలో టీడీపీ సంబంధించిన 250 మంది కుటుంబాలు వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలన్నీ కూటములు కట్టి జగనన్నను ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా కోట్లాది మంది ప్రజానీకం అండతో జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారని, జగనన్న సిద్ధం సభలు, మేమంతా సిద్ధం సభలు, బస్సు యాత్రలకు జనం పోటెత్తుతున్నారని, ప్రజాభీష్టం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. నెలరోజులుగా కూటమి పార్టీల నాయకులు ఆయా పార్టీలను వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.