గుడివాడలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేప్టటారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుడివాడ ప్రధాన వీధుల గుండా టీడీపీ కార్యాలయం వరకు జరిగిన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కుతూ పార్టీ శ్రేణులను రాము - సుఖద దంపతులు ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుడివాడ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అని.. ఆయన ద్వారానే రాష్ట్ర అభివృద్ధి అని అన్నారు. ఐదేళ్లుగా సీఎం జగన్ రెడ్డి చేతిలో దగాపడ్డ వర్గాలన్నీ చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. బాబు గెలిస్తేనే యువతకి జాబు వస్తుందని..... రాష్ట్రం వెలిగిపోతుందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వంపై కసి.. చంద్రబాబుపై ప్రేమ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని బతికించేది చంద్రబాబే అని స్పష్టం చేశారు. గుడివాడలో మార్పు మొదలైందని.. ఒక్క పిలుపుతో ఇన్ని వేలమంది యాత్రలో పాల్గొన్న సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబు ఇప్పటికి నవ యువకుడని.. ఇంత ఎండల్లో కూడా 20 గంటలు కష్టపడుతున్నారని అన్నారు. రాత్రులు తిరిగి పగలు పడుకొనే... గుట్కా నానికు చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి లేదని వెనిగండ్ల రాము విమర్శలు గుప్పించారు.
![]() |
![]() |