కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరి లోక్‌సభ స్థానానికి సంబంధించి యానాం నియోజవర్గంలో శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. యానాంలో 39,408 మంది ఓటర్లకు పురుషులు 19,037, మహిళలు 20,371 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 14,821 మంది, మహిళలు 15,655 మంది మొత్తంగా 30,476 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.33శాతం పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు యానాం నియోజకవర్గం పరిధిలోని 33 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ బూత్-12లో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులు, తనయుడు రఘువంశీ, అనుపమ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, తల్లి భారతి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రానికి ఊపందుకుంది. ఈవీఎంలు ఎక్కడా మొరా యించలేదు. యానాం నియోజకవర్గంలో పోలింగ్ ముగిసిన అనంతరం భారీ భద్రత మధ్య ఈవీఎంలు, వీవీప్యాడ్‌లను ఎన్నికల అధికారుల సమక్షంలో డాక్టర్ ఎస్‌ఆర్‌కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్స్‌కు తరలించి సీలు వేశారు. స్ర్టాంగ్‌రూమ్స్‌వద్ద సీసీ కెమెరాల పర్య వేక్షణలో భద్రత పర్యవేక్షిస్తున్నారు. జూన్ 4న యానాంలో ఓట్లను లెక్కిస్తారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 93శాతం ఓట్లు నమోదు కాగా, పుదుచ్చేరి పార్లమెంట్‌కు సంబంధించిన ఇప్పుడు యానాంలో 77.33శాతం నమోదయ్యాయి.
![]() |
![]() |