ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీ.ఫామ్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు నుంచి బీ.ఫామ్స్ పంపిణీ ప్రారంభమైంది. ముందు పార్లమెంట్, తర్వాత అసెంబ్లీ అభ్యర్థులకు చంద్రబాబు బీ.ఫామ్స్ ఇస్తున్నారు. రఘురామకృష్ణంరాజు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేస్తున్నానని, బీ.ఫామ్ తీసుకోవాలని అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు తాను చంద్రబాబు నివాసానికి వచ్చానని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.
![]() |
![]() |