ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముకేష్ కుమార్ మీనా ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 26 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఉద్యోగులు ఎక్కడున్నా పని చేసే చోటే ఫామ్-12 ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే వారందరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa