2024 ఫిబ్రవరిలో మొత్తం 15.48 లక్షల మంది సభ్యులు సంస్థలో చేరారని EPFO వెల్లడించింది. తొలిసారిగా 7.78 లక్షల మంది సభ్యులు చేరగా.. కొత్తవారు 18-25 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.36 శాతంగా ఉన్నారని పేర్కొంది. 2.05 లక్షల మంది మహిళలున్నారు. తయారీ, మార్కెటింగ్ సేవలు, కంప్యూటర్ల వినియోగం, ఆటోమొబైల్ సర్వీసింగ్, టైక్స్టైల్స్ తదితర రంగాల్లో అధికంగా సభ్యులు చేరారు.