డిజిటల్ సేవల విభాగాన్ని విస్తరించే యోచనలో ఉన్న కంపెనీలకు భారత్ ఉత్తమ ఎంపికగా మారిందని ఐటీ సేవల పరిశ్రమ సంఘం నాస్కామ్ నివేదిక తెలిపింది. కృత్రిమ మేధ, డేటా అనాలటిక్స్, సైబర్ భద్రతపై కంపెనీలు పెట్టుబడులు పెంచే అవకాశముందని తెలిపింది. 11 ప్రధాన రంగాలు, ఏడు ప్రధాన భౌగోళిక ప్రాంతాల్లోని 550 సంస్థలపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను నాస్కామ్ రూపొందించింది.