జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో ఆదివారం భారత సైన్యం, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్న కమరుద్దీన్ ఇంట్లో సోదాలు చేశారు. ఆయన ఇంట్లో పాక్‌లో తయారైన పిస్టల్, చైనా గ్రెనేడ్లు పట్టుబడ్డాయి. ఆయనను రిజిస్టర్డ్ ఓవర్-గ్రౌండ్ వర్కర్ (OGW)గా భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో ఆయనను విచారిస్తున్నారు. త్వరలో పూంచ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.