ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు విధించే అంశంపై చర్చ జరగాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఈ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు శ్వేతపత్రం విడుదల చేయాలని హితవు పలికారు. హామీలకు అయ్యే వ్యయం- చేకూరే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.