దేశవ్యాప్తంగా ఏప్రిల్ 21ని జాతీయ పౌర సేవల దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశంలోని ప్రజలందరికీ ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారివారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016, ఏప్రిల్ 21న ఈ పౌర సేవల దినోత్సవాన్ని ప్రారంభించింది. ఉత్తమ సేవలు ఉద్యోగులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది.