వైసీపీలో చాలామంది తన అభిమానులు ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన రాష్ట్రాన్ని పరిపాలించే మహారాణి వెళ్ళిపోవాలని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జక్కంపూడి కుటుంబం పై తనకు గౌరవం ఉందన్నారు. రాజానగరం నియోజకవర్గం గంజాయి, ఇసుక అక్రమ తవ్వకాలుకు అడ్డగా మారిందని ఆరోపించారు. బలమైన బవిష్యత్తు ఇవ్వటానికి వచ్చానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ సర్వనాశనం అవుతుందని విరుచుకుపడ్డారు. ప్రజలు ఆలోచించి ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. వైసీపీ ప్యాన్‌కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు. దళిత డ్రైవర్‌ను హత్య చేసినందుకు చాలా కోపం వచ్చిందని అన్నారు. జక్కంపూడి కుటుంబం నుంచి వచ్చి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లను ప్రోత్సాహిస్తున్నారని విమర్శించారు. జగన్‌తో చెడు సాహవాసంతో జక్కంపూడి కుటుంబ సభ్యులు పాడైపోయారన్నారు. లే అవుట్లకు 15 శాతం కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. నన్నయ విశ్వవిద్యాలయం వీసీ పదవి ఇచ్చేందుకు కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. జక్కంపూడి దౌర్జన్యం పోవాలంటే జనసేనను గెలిపించాలని కోరారు.