మాజీ మంత్రి వివేకానందారెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదని, చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హెచ్చరించారు. వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్న వివేక పర్సనల్ లైఫ్‌ని టార్గెట్‌గా చేసి మాట్లాడటం మానుకోవాలని మందలించారు. ఆదివారం నాడు కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చిందన్నారు. సీబీఐ చార్జ్ షీట్‌లో పేర్కొన్న విషయాలే తాను, వివేకా కూతరు సునీత మాట్లాడుతున్నామని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిప్టు చదవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బిడ్డనని అన్నారు. మా అత్త ఇంకెవరైనా ఈ కేసు గురించి ఎన్ని మాట్లాడినా న్యాయమే గెలుస్తోందని స్పష్టం చేశారు.