బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కృషి చేసిందని బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే బ్రాహ్మణులకు మేలు చేసిందని చెప్పారు. 175 అసెంబ్లీ స్దానాలలో ఒక్క స్దానం కూడా టిడిపి బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని పచ్చమీడియా ఎందుకు హైలెట్ చేయడం లేదని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ...... అర్చకులకు వంశపారపర్యహక్కులను వైయస్సార్ సిపి ప్రభుత్వం పునరుద్దరించింది. 11,142 అర్చక కుటుంబాలకు మేలు చేసే విధంగా చేసింది. 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వం అర్చకుల గౌరవవేతనం 1,105 మందికి 21 కోట్ల రూపాయలు ఇచ్చారు. 4,346 మందికి గౌరవ వేతనం పెంచి 62 కోట్ల రూపాయలను అందించింది. ధూపదీప నైవేద్యం 1621 ఆలయాలను 81 లక్షలు మాత్రమే టిడిపి హయాంలో పెంచారు.వైయస్సార్ సిపి ప్రభుత్వం 5,338 దేవాలయాలకు 2.66 కోట్ల రూపాయలకు పెంచారు. ఏపిలో జగన్ గారి ప్రభుత్వం వచ్చాక అర్చకులకు,పురోహితులకు గృహనిర్మాణం,ఆరోగ్యం,వైద్యం కాని మూడు అంశాలలో శాచ్యురేషన్ పద్దతిలో పధకాలను అందించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గత ప్రభుత్వంలో 162 కోట్ల రూపాయలతో 851 దేవాలయాలు మాత్రమే నిర్మించగా, వైయస్సార్ సిపి ప్రభుత్వం హయాంలో 1683 కోట్ల రూపాయలతో3,958 దేవాలయాలను నిర్మించడానికి వెచ్చించారు అని తెలిపారు.