తెలుగుదేశం పార్టీ ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని, పలు అంశాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, గ్రీవెన్స్ సెల్ రా ష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, పార్టీ లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి లు ఇందుకు తగిన ఆధారాలను ఎన్నికల అధికారులకు అందచేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని సైకోగా సంభోదిస్తూ పాటను రచించి దానిని సోషల్ మీడియా, యూట్యూబ్ లలో ప్రచారం చేస్తోంది. ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం.కాబట్టి తెలుగుదేశం పార్టీ పై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అనుసరించి చర్యలు తీసుకోవాలని కోరారు.