పీసీసీ అధ్యక్షురాలు షర్మిలలు ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని, పలు అంశాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వివేకానంద రెడ్డి హత్య గురించి బహిరంగసభలలో మాట్లాడుతున్నారు,ఆరోపణలు చేస్తున్నారు. ఇలా పదే పదే చేస్తున్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు.