ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం చేస్తుందని వైయస్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణ మూర్తి మండిపడ్డారు. తెలుగుదేశం నేతలు ప్రజలలో అయోమయం సృష్టించేందుకు విషప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ..... పేదవాడి సొంత ఇంటికలను వైయస్ జగన్ నెరవేర్చారు.ప్రతి ఇల్లు లేని మహిళకు లక్షలాది రూపాయల ఇంటిస్దలాన్ని సమకూర్చారు. ఇంటి నిర్మాణం కూడా దాదాపు 22 లక్షలమందికి నెరవేర్చేదిశగా సాగుతోంది. ప్రజలు మళ్ళీ జగన్ నే సీఎంగా గెలిపించుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ,బీసీ, ఎస్టీ, మైనారిటీ అందరూ వైయస్ జగన్ వైపు ఉన్నారు.ప్రతిపక్ష పార్టీలన్ని జెండాలు జత కట్టాయి.టీడీపీ వాళ్ళు వస్తే మేము చేసిన అభివృద్ధి చూపిస్తాము.వచ్చే దమ్ము ఉందా..నా సవాల్ స్వీకరిస్తారా...దేశంలోనే అమ్మఒడి పథకం గొప్పది కానీ దాని మీద కూడా అసత్య ప్రచారం టీడీపీ చేస్తుంది.పేదవాడు చదువుకుంటే చూడలేకపోతున్నారు.నవరత్నాలు మీద అసత్య ప్రచారం చేస్తే ఊరుకొనేది లేదు.నవరత్నాలకు ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు. వారే టిడిపి కూటమికి తగిన బుధ్ది చెప్తారు.నాడు,నేడు భాగంగా స్కూల్స్ అన్ని సౌకర్యాలు చేశాం.నేడు పల్లెల్లోని పేద పిల్లలను ప్రపంచస్దాయి విద్యార్దులుగా తీర్చిదిద్దుతున్నారు.తెలుగుదేశం నేతలు ఆలోచించండి...మీ కొడుకులు అమెరికా వెళ్లి చదవాలి కానీ పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా.... వైయస్ జగన్ గారి ఒక్కడి మీద విష ప్రచారం చేస్తున్నారు. కాని వైయస్ జగన్ వెనుక 5కోట్ల మంది ప్రజలు ఉన్నారనే విషయం గుర్తుంచుకోండి అని హెచ్చరించారు.