ఓటర్లను వెధవలు అని టీడీపీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే అని తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ తప్పుపట్టారు. ఓ ఎన్ ఆర్ ఐ గా కోమటి జయరాం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఓటర్లను కొనుగోలు చేయవచ్చనే తానా మాజీ అధ్యక్షుడు, టిడిపి ఎన్ ఆర్ ఐ యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం వ్యాఖ్యలు ఎన్ ఆర్ ఐ లందర్ని ప్రజల దృష్టిలో చులకన చేయడమే అవుతుందని.....ఈ విషయంలో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతోపాటు కోమటి జయరాం ప్రజలకు, ఓటర్లకు క్షమాపణ చెప్పాలని తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి కోమటి జయరాం వ్యాఖ్యలు చూసి షాక్ తిన్నాను. తానా లాంటి వాటికి అధ్యక్షులు గా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.సేవ చేయాలంటే ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చు. గ్రామాలను అభివృధ్ది చేయాలనే ధ్యేయంతో ఎన్ ఆర్ ఐలు పనిచేస్తుంటాం. ఓటర్లను వెధవలు అని అవమానకర రీతిలో మాట్లాడటం బాగాలేదన్నారు.జయరాం గారు ఆయన ఉన్న పార్టీ ఓటర్లకు,ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందనే రీతిలో పనిచేయాలి. అంతేకాని ఓటర్లను కొనుగోలు చేయవచ్చనే ఆలోచనలు ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీస్తాయని అన్నారు.అమెరికాలాంటి దేశాలనుంచి వచ్చి కోట్ల రూపాయలు పెట్టి ఓట్లు కొంటాం అనే మాట చాలా గర్హనీయం.ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.అదే విధంగా జగన్ గారిపై రాయి దాడిని అందరూ ఖండించాలన్నారు.పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకుంటున్న జగన్ గారి మీది రాయి వేయడం అంటే పేదవాడి గుండెపై వేసిన రాయి అన్నారు.కోమటి జయరాం వ్యాఖ్యలను టిడిపి అద్యక్షుడు చంద్రబాబు ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు.జయరాం గారు మీ దగ్గర డబ్బులు ఉంటే ప్రజలకు సేవచేసి అభిమానం పొందండి అంతేగాని వారు అమ్ముడుపోయేవారు అనేరీతిలో వ్యాఖ్యలు చేయవద్దని హితవు చెప్పారు.