ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన, మీరావలి మరియు సుభాని ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైస్సార్సీపీ లోకి చేరారు. మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కేపి. కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గోన్నారు.