పాడేరు భారతీయ జనతా పార్టీ ఇన్‌చార్జ్ (అసెంబ్లీ యాస్పిరెంట్) కురసా పార్వతమ్మ(రిటైర్డ్ జీసీసీ డీఎం) సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతాపార్టీల నుంచి పలువురు కీలక నేతలు వైయస్ఆర్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.