చంద్రబాబు..నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. విశాఖపట్టణంలోని ఎంపీ అభ్యర్థి ఘాన్సీ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.... - చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన భాష, మాట్లాడే తీరును చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాజకీయం అనుభవశాలిగా చెప్పుకుంటూనే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని పట్టుకుని నెత్తిమీద అర్ధరూపాయి పెడితే దమ్మిడీకి కొనరంటున్నాడు. స్పీకర్‌నైతే రకరకాల పేర్లతో పిలుస్తాడా..? అసలెందుకు అంత సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. నాయకులుగా గెలుస్తాం. ఓడతాం.. అయితే, తాను, తన కూటమి ఓడిపోబోతుందని తెలిసి అంత సహనం కోల్పోయి నోటికేదొస్తే అది మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా..? అతను ఏమనుకుంటున్నాడు.? ప్రజలు ఛీకొట్టే విధంగా మాట్లాడటానికి అతను సిగ్గుపడాలి అని ఆగ్రహం వ్యక్తపరిచారు.
![]() |
![]() |